Home
Mobile

ఈ ఫోన్‌ను రూ.8 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.. 12GB ర్యామ్, 256GB స్టోరేజీ, టెలిఫోటో లెన్స్‌..!

Motorola Edge 50 pro 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి గత సంవత్సరం మోటోరోలా ఎడ్జ్‌ 50 సిరీస్‌ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో సహా మరిన్ని మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతోపాటు అనేక బెస్ట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

విడుదల సమయంలో ధరలు ఇలా :
విడుదల సమయంలో మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.31999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.35999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Motorola Edge 50 Pro 5G smartphone

రూ.8 వేల తగ్గింపు ధరతో :
ఫ్లిప్‌కార్ట్‌ లో ప్రస్తుతం 8GB/128GB వేరియంట్‌ ధర రూ.27999 అంటే రూ.4000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అదే 12GB/256GB ధర రూ.27999 గా ఉంది. అంటే సుమారు రూ.8 వేల డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాక్‌ బ్యూటీ, కనీల్‌ బే, లక్స్‌ లావేండర్‌, మూన్‌లైట్‌ పెర్ల్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

Motorola Edge 50 Pro 5G smartphone

టెలిఫోటో కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ Pantone ఆధారిత AI ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 3x జుమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా విభాగం ఇంటెలిజెంట్‌ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, అడ్వాన్స్‌డ్‌ లాంగ్ ఎక్స్‌పోజర్‌ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Pro 5G smartphone now available with Rs8000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X