50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ బ్యాంకు కార్డుతో రూ.4400 తగ్గింపు..!
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Pro Smartphone) ఇటీవల భారత్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లతో విడుదల అయింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
రూ.4,400 తగ్గింపు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.31,999 కు విడుదల అయింది. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.30,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,400 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.26,599 కే సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ సాధారణ ధర రూ.35,999 ఉండగా.. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.30,399 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల కర్వడ్ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. DC డిమ్మింగ్ సపోర్టుతో లాంచ్ అయింది. 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాంతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్ మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్లు ఇస్తామని మోటోరోలా సంస్థ వెల్లడించింది.
ఈ హ్యాండ్‌సెట్ Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్ కెమెరాలను కలిగి ఉన్నాయి. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావేడ్ యాంగిల్ కెమెరా మరియు 3X జూమింగ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఆటోఫోకస్ సామర్థ్యంతో కూడిన 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్ ట్రాకింగ్, అడ్వాన్సడ్ లాంగ్ ఎక్స్పోజర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ దీంతోపాటు బోకేష్ ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరిచేందుకు AI ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ఎసిటేట్ ఫినిష్‌తో కూడిన మూన్ లైట్ పెర్ల్, లక్సీ లావెండర్, సిలికాన్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో కూడిన బ్లాక్ బ్యూటీ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మూన్ లైట్ పెర్ల్ కలర్ హ్యాండ్ సెట్ హ్యాండ్ మేడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications