ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్‌ప్లేతో మోటోరోలా స్మార్ట్‌ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
మోటోరోలా నుంచి త్వరలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro Smartphone) త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ మేరకు సంస్థ X ప్లాట్‌ఫాం ద్వారా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఏరోజు విడుదల కానుందనే సమాచారాన్ని వెల్లడించలేదు. మరియు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా ఈ హ్యాండ్ సెట్ అనేక వివరాలు వెల్లడయ్యాయి.
మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో హ్యాండ్ సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC చిప్ సెట్‌పైన పనిచేస్తుందని సమాచారం. మరియు ఈ కొత్త ఫోన్ మూడు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజీ ఆధారంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.5k రిజల్యూషన్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 144Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే SGS టెక్నాలజీతో బ్లూ లైట్ ను నియంత్రిస్తుంది. ఫలితంగా కంటికి రక్షణ కల్పిస్తుంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.
దీంతోపాటు ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ తొలిసారిగా Pantone కెమెరాను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. మరియు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ఏఐ కెమెరా, 50X హైబ్రిడ్ జూమ్‌తో అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది.
ఇప్పటికే వచ్చిన అనేక లీక్‌ల ఆధారంగా ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్నాప్ డ్రాగన్ 8S జెన్ 2 SoC ఆధారంగా పనిచేస్తుంది. మరియు R హ్యాండ్ సెట్ ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ బ్లాక్, పర్పల్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
డిజైన్ పరంగా ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది. మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే ర్యామ్, స్టోరేజీ సహా ధరపై ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. అయితే విడుదల తేదీ వెల్లడయ్యాక ఒక్కొక్కటిగా మిగిలిన స్పెసిఫికేషన్లు కూడా తెలిసే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








