Home
Mobile

12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ, 50MP సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 (Flipkart Big Billion Days Sale 2024) ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మా్ర్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. తాజాగా మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల ధరతో పోలిస్తే ఏకంగా రూ.6000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. 6.7 అంగుళాల డిస్‌ప్లేతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.

మోటోరాలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్‌ :
మోటోరాలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.35,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.6000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే రూ.29,999 కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కేవలం 12GB ర్యామ్ వేరియంట్‌ పైనే ఉంది. బ్యాంకు కార్డులతో మరింత ధర తగ్గనుంది.

Motorola Edge 50 Pro Smartphone attracts with RS6000 discount on flipkart sale 2024

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Pro Smartphone) 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, DC డిమ్మింగ్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. HDR10+ సపోర్టు చేస్తుంది.

4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 3 SoC తో పనిచేస్తుంది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంది. ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్‌ 3 OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందనుంది.

Motorola Edge 50 Pro Smartphone attracts with RS6000 discount on flipkart sale 2024

50MP + 13MP+ 10MP+ 50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆల్‌ పిక్సల్‌ ఫోకస్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్‌+ మ్యాక్రో విజన్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు OIS సపోర్టుతో 10MP టెలిఫోటో కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం క్వాడ్‌ పిక్సల్‌ టెక్నాలజీతో కూడిన 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో తొలిసారిగా Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

120W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 4500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 120W టర్బోపవర్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. బ్లాక్ బ్యూటీ, Caneel bay, లక్సీ లావెండర్ రంగుల్లో లభిస్తుంది. IP68 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌, ఇన్‌ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Pro Smartphone gets massive discount on flipkart big billion days sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X