50MP సెల్ఫీ కెమెరా, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో మోటోరోలా స్మార్ట్‌ఫోన్ విడుదల.. ప్రపంచంలోనే తొలిసారిగా!
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Pro Launched) భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు, సామర్థ్యాలను దీంతోపాటు ప్రపంచంలోనే తొలిసారిగా Pantone కెమెరాను కలిగి ఉందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు పాన్‌టోన్ స్కిన్‌టోన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల కర్వడ్ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. DC డిమ్మింగ్ సపోర్టుతో లాంచ్ అయింది. ఈ ఫోన్ జనరేటివ్ AI సపోర్టును కలిగి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని మోటోరోలా సంస్థ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాంతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం విషయానికి వస్తే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే తొలిసారిగా Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్ కెమెరాలను కలిగి ఉన్నట్లు మోటోరోలా వెల్లడించింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావేడ్ యాంగిల్ కెమెరా (ఈ కెమెరా మ్యాక్రో లెన్స్‌గా కూడా పనిచేస్తుంది).

మరియు 3X జూమింగ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ f/1.9 అపేచర్, ఆటోఫోకస్ సామర్థ్యంతో కూడిన 50MP కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్ ట్రాకింగ్, అడ్వాన్సడ్ లాంగ్ ఎక్స్పోజర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ దీంతోపాటు బోకేష్ ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరిచేందుకు AI ఇంజిన్‌ను ఉపయోగించింది. మొత్తంగా ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన కెమెరా, ఫీచర్లను కలిగి ఉంది.

ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎసిటేట్ ఫినిష్‌తో కూడిన మూన్‌లైట్ పెర్ల్, లక్సీ లావెండర్, సిలికాన్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో కూడిన బ్లాక్ బ్యూటీ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మూన్‌లైట్ పెర్ల్ కలర్ హ్యాండ్‌సెట్ హ్యాండ్‌మేడ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయింది.
స్టోరేజీ వేరియంట్లు, సేల్ వివరాలు :
ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో విడుదల అయింది. మోటోరోలా సంస్థ ఈ ఫోన్ సేల్ వివరాల వెల్లడించింది.

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఏప్రిల్ 9 నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ను (Motorola Edge 50 Pro sale) కొనుగోలు చేయవచ్చని తెలిపింది. మరియు ప్రారంభ ఆఫర్ కింద రూ.2000 తగ్గింపును ప్రకటన చేసింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లను కూడా ప్రకటించింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. ఈ వేరియంట్ 68W ఛార్జర్‌ను కలిగి ఉంటుంది. మరియు 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఈ మోడల్ 125W ఛార్జర్‌ను కలిగి ఉంటుంది.
ప్రారంభ ధర కింద ఈ రెండు వేరియంట్ల ధరను రూ.2000 చొప్పున తగ్గించింది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్‌ను రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. మరియు HDFC బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు లేదా EMI లావాదేవీలు నిర్వహిస్తే రూ.2,250 వరకు తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications







