Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 256GB స్టోరేజీ మోటోరోలా 5G ఫోన్‌ సేల్‌.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!

మోటోరోలా నుంచి ఇటీవల మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్ కొత్త కలర్‌ వేరియంట్‌ భారత్‌లో ఇటీవల లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌ సెట్‌ ఈ సంవత్సరం మార్చిలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ మూన్‌లైట్‌ పెరల్‌, లక్సీ లావెండర్‌, బ్లాక్‌ బ్యూటీ వంటి రంగుల్లో అందుబాటులో ఉండగా.. తాజాగా వెనిలా క్రీమ్‌ వేరియంట్‌ (Motorola Edge 50 Pro Smartphone Vanilla Cream Variant) కూడా ఈ జాబితాలో చేరింది. అయితే ఈ కొత్త కలర్ వేరియంట్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో వనిల్లా క్రీమ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లిప్‌కార్ట్‌, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 50 Pro Smartphone Vanilla cream variant sale

రూ.2000 తగ్గింపు : SBI క్రెడిట్‌ కార్డు, HDFC బ్యాంకు, యాక్సెస్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు Spotify ప్రీమియం 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ వేగాన్‌ లెదర్‌ లేదా ప్లాస్టిక్‌ బ్యాక్‌ ప్యానల్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్‌ 1.5k pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌ నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్, DC డిమ్మింగ్‌, HDR10+ సపోర్టు తో అందుబాటులో ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f1/4 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 13MP అల్ట్రావైడ్‌ కెమెరా, f/2.0 అపేచర్‌, 3X జూమింగ్‌, OIS సపోర్టుతో 10MP టెలీఫొటో కెమెరాలను కలిగి ఉంది. మరియు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, టిల్ట్‌ షిఫ్ట్‌ మోడ్‌ సహా బోకేష్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Pro Smartphone Vanilla cream variant sale is live
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X