నీటిలో 30 నిమిషాలున్నా డ్యామేజీ కానీ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్..256GB స్టోరేజీ, 50MP కెమెరా సహా..!
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. బిగ్ బచత్ డేస్ పేరుతో (Flipkart Bachat Days 2024) ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉంచింది. ఈ సేల్ ఇవాళ్టి నుంచి నవంబర్ 11 వరకు జరుగుతుందని తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయం, నోకాస్ట్ EMI సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆగస్టులో భారత్ మార్కెట్‌లోకి విడుదల అయింది. మిడ్‌రేంజ్ ధరలో అందుబాటులో ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 నియో ఫోన్‌లు ఉన్నాయి. అయితే మోటోరోలా ఎడ్జ్ 50 హ్యాండ్‌సెట్ (Motorola Edge 50 Smartphone) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.27,999 గా ఉంది.

కేవలం 3 నెలల్లోనే రూ.1000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.26,999 గా ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు IDFC, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.2000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. జంగిల్ గ్రీన్, koala గ్రే, పీచ్ ఫజ్ రంగుల్లో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల కర్వడ్ 1.5k సూపర్ HD+ pOLED ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2712* 1220 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు సహా గొరెల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మా్ర్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 SoC యాక్సెలిరేటెడ్ ఎడిషన్ (AE) చిప్‌సెట్ ను కలిగి ఉంది. Adreno 644 తో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలిపింది.
ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో అందుబాటులో ఉంది. OIS సపోర్టు, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 13MP అల్ట్రావైడ్ కెమెరా, f/2.0 అపేచర్, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 హ్యాండ్‌సెట్ 68W టర్బో పవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌గా ఉంది. 1.5 మీటర్ లోతులోనూ 30 నిమిషాల వరకు డ్యామేజీ కాకుండా ఉంటుందని మోటోరోలా చెబుతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్మా్ర్ట్‌వాటర్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ సౌకర్యవంతంగా వినియోగించుకొనేందుకు వీలుంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ మోటోరోలా ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, WiFi 6E, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉంది


Click it and Unblock the Notifications








