Home
Mobile

నీటిలో తడిచినా డ్యామేజీ కానీ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ..!

మోటోరోలా ఎడ్జ్‌ 50 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Smartphone) గత సంవత్సరం ఆగస్టులో భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఎడ్జ్‌ 50 సిరీస్‌ లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 1.5k సూపర్‌ HD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఆరు నెలల్లోనే రూ.4000 డిస్కౌంట్! :
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ ను రూ.23,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు ఆరు నెలల కాలంలోనే రూ.4,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Motorola Edge 50 Smartphone

అదనపు తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. దీంతోపాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ జంగిల్‌ గ్రీన్‌, పీచ్‌ ఫజ్‌ కోలా గ్రే రంగుల్లో లభిస్తోంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. మరియు 4nm స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC యాక్సెలిరేటెడ్‌ ఎడిషన్ (AE) ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందనుంది.

Motorola Edge 50 Smartphone

డిస్‌ప్లే వివరాలు :
ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల (2712* 1220 పిక్సల్స్‌) కర్వడ్‌ 1.5k సూపర్‌ HD+ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ MIL-810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. దీంతోపాటు IP68 రేటింగ్‌ తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా 1.5 మీటర్‌ నీటిలో 30 నిమిషాల వరకు డ్యామేజీ కాకుండా ఉంటుందని మోటోరోలా తెలిపింది.

స్మార్ట్‌ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ స్మార్ట్‌ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. 68W టర్బో పవర్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్‌ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

ట్రిపుల్‌ కెమెరా :
ఈ మోటోరోలా ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. f/2.2 అపేచర్‌తో 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, f/2.0 అపేచర్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను అమర్చి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Smartphone gets Rs4000 discount on flipkart 2025 check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X