50MP సోనీ కెమెరా, 256GB స్టోరేజీ, 68W టర్బో ఛార్జింగ్ 5G ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్..!
Motorola Edge 50 Smartphone : మోటోరోలా నుంచి ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికీ బెస్ట్ మోడల్స్‌లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. గత సంవత్సరం ఎడ్జ్ 50 మోడల్స్ లాంచ్ కాగా.. ఈ సంవత్సరం మోటోరోలా నుంచి ఎడ్జ్ 60 సిరీస్ విడుదల అయింది.
రూ.6000 తగ్గింపు ధరకు అందుబాటులో :
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.27999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్ ధర రూ.21999 గా ఉంది. అంటే రూ.6000 తగ్గింపును పొందవచ్చు.

మూడు కలర్ వేరియంట్స్ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో రూ.20 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ జంగిల్ గ్రీన్, పీచ్ పజ్, కోలై గ్రే కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందబాటులో ఉంది.
కర్వడ్ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల కర్వడ్ 1.5k సూపర్ HD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే స్మార్ట్ వాటర్ టచ్ సపోర్టును కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 SoC AE ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. Adreno 644 ను కూడా కలిగి ఉంది. చిప్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
68W టర్బో పవర్ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 68W టర్బో పవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, WiFi 6E, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








