నీటిలో 30 నిమిషాలపాటు ఉన్నా డ్యామేజీ కాని 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ధర, ఫీచర్‌ల వివరాలు..!
మోటోరోలా నుంచి ఆగస్టు 1వ తేదీన మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Smartphone Sale) భారత్‌లో విడుదల అయింది. ఎడ్జ్ 50 సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 50 ప్రో మరియు ఎడ్జ్ 50 అల్ట్రా మోడళ్లు ఇప్పటికే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండగా.. ఇవాళ్టి నుంచి ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. మోటోరోలా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ధర ప్రస్తుతం రూ.27,999 గా ఉంది. యాక్సెస్, IDFC ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, EMI లావాదేవీల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్ ధర రూ.25,999 గా ఉంటుంది. మరియు 9 నెలల వరకు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 స్మా్ర్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ 1.5k సూపర్ HD రిజల్యూషన్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. HDR10+, డాల్బీ అట్మాస్ సపోర్టును కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 SoC యాక్సెలిరేటెడ్ ఎడిషన్ ను కలిగి ఉంది. ర్యామ్ బూస్టర్ టెక్నాలజీ ద్వారా వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. 2 OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ చెబుతోంది.

ఈ హ్యాండ్‌సెట్ మోటో AI సపోర్టుతో మూడు కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 700 కెమెరా, 3x జూమ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరా, 13MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ 68W టర్బో పవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రిసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా 1.5 మీటరు లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉన్నా ఎటువంటి డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది.
స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను నియంత్రించవచ్చు. MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పనిచేస్తుంది. 5G, 4G LTE, వైఫై 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications