ఆగస్టు15న మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ రెండో సేల్.. IP68 రేటింగ్ గురించి తెలిస్తే కచ్చితంగా కొనుగోలు చేస్తారు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ భారత్ మార్కెట్‌లో గత మోటోరోలా వారం మోటోరోలా ఎడ్జ్ 50 (Motorola Edge 50 Smartphone) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ తొలి సేల్ ఆగస్టు 8న నిర్వహించారు. ఈ హ్యాండ్‌సెట్ ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రెండోసారి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 50 ప్రో మరియు ఎడ్జ్ 50 అల్ట్రా మోడళ్ల లైనప్‌లోకి ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ చేరింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.27,999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చని.. ఫలితంగా రూ.25999 కే కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఇతర ప్రముఖ స్టోర్‌లు సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 స్మా్ర్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్, ఫీచర్‌లు :
మోటోరోలా ఎడ్జ్ 50 స్మా్ర్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 SoC యాక్సెలిరేటెడ్ ఎడిషన్ (AE) చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ర్యామ్ బూస్టర్ టెక్నాలజీ ద్వారా వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్, 2 OS అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ తెలిపింది.
ఈ స్మా్ర్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్ 1.5k సూపర్ HD రిజల్యూషన్ pOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+, డాల్బీ అట్మాస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 3x జూమింగ్ సామర్థ్యంతో 10MP టెలిఫోటో కెమెరా, 13MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను అమర్చారు.
IP68 రేటింగ్, 5000mAh :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ 68W టర్బో పవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుందని సంస్థ చెబుతోంది. స్మార్ట్‌వాటర్ టచ్ ఫీచర్ కారణంగా తడి చేతులతోనూ నియంత్రించవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా 1.5 మీటరు లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉన్న ఎటువంటి డ్యామేజీ కాదని మోటోరోలా సంస్థ తెలిపింది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








