మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. ఆకట్టుకొనే డిజైన్, 5000mAh బ్యాటరీ సహా కీలక స్పెసిఫికేషన్‌లు..!
మోటోరోలా నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి విడుదల కానుందని తెలుస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Smartphone) ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కనిపించింది. ఫలితంగా త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
ఈ సిరీస్‌లో భాగంగా బేస్ మోడల్ త్వరలో విడుదల కానుంది. BIS వెబ్‌సైట్‌లో XT2407-3 మోడల్ నంబర్‌తో కనిపించింది. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై కొన్ని లీక్‌లు వెలువడ్డాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 68W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో రానుందని తెలుస్తోంది.

యూరప్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 599 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.54,162) గా ఉంది. అయితే భారత్ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తుందని సమాచారం. కనెక్టివిటీ పరంగా Wi-Fi, 5G, NFC, బ్లూటూత్, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు సహా విడుదల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
* మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌కు చెందిన ప్రో మోడల్ మరో కొత్త కలర్ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ పెరల్, లక్సీ లావెండర్, బ్లాక్ బ్యూటీ వంటి రంగుల్లో అందుబాటులో ఉండగా.. తాజాగా వెనిలా క్రీమ్ వేరియంట్‌లో కూడా లాంచ్ అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో వెనిలా క్రీమ్ వేరియంట్ 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్ కార్డు, HDFC బ్యాంకు, యాక్సెస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








