ఈ ఫోన్‌పై రూ.7000 తగ్గింపు.. 256GB స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP సోనీ కెమెరా సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా (Motorola India) ఎంట్రీ, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్స్ అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ ను లాంచ్ చేసింది. గత సంవత్సరం విడుదల చేసిన ఎడ్జ్ 50 సిరీస్‌కు తర్వాత తరం వెర్షన్‌గా 60 సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.20999 గా ఉంది. అంటే సుమారు రూ.7000 డిస్కౌంట్ ను పొందవచ్చు. బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు.

మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ లో ఈ ఫోన్‌ను రూ.19,999 కే అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం Out Of Stock లో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ జంగిల్ గ్రీన్, పీచ్ పజ్, కోలై గ్రే కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల కర్వడ్ 1.5k సూపర్ HD+ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. గొరెల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. మరియు స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

వైర్‌లెస్ ఛార్జింగ్ :
మోటో స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 SoC AE చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 644 GPU ను కూడా అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 68W టర్బో పవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP సోనీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ తో 10MP టెలిఫోటో కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.


Click it and Unblock the Notifications








