Home
Mobile

Motorola ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ సహా కీలక స్పెసిఫికేషన్లు లీక్‌.. పూర్తి వివరాలు.. !!

మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ ( Motorola Edge 50 Ultra Smartphone ) త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు మరో రెండు హ్యాండ్‌ సెట్‌లు కూడా లాంచ్‌ కానున్నాయి. అయితే మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ ఏప్రిల్‌ 3న భారత్‌లో లాంచ్‌ కానుంది. తాజాగా అల్ట్రా మోడల్‌ హ్యాండ్‌సెట్ డిజైన్‌ విడుదలైంది. దీంతోపాటు కలర్‌ ఆప్షన్‌లు కూడా లీక్‌ అయ్యాయి.

కర్వడ్ డిస్‌ప్లే సహా కీలక ఫీచర్లు : టిప్‌స్టర్‌ ఇవాన్‌ బ్లాస్‌ ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు. ఈ వీడియో ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది మరియు టెక్చరడ్ బ్యాక్‌ ప్యానల్‌, కర్వడ్‌ డిస్‌ప్లే ఎడ్జ్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ డ్యూయల్‌ స్పీకర్లను కలిగి ఉంటుంది.

Motorola Edge 50 Ultra Smartphone

IP68 రేటింగ్‌తో..! :
దీంతోపాటు ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ (Motorola Edge 50 Ultra leaked Specs) పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్క్రాచ్‌ రెసిస్టెన్స్‌ స్క్రీన్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఓ వీడియోలో ఈ ఫోన్‌ను నీటి నుంచి బయటకు తీయడం కనిపించింది.

ఫలితంగా ఈ హ్యాండ్‌ సెట్‌ IP68 రేటింగ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బీజ్‌, బ్లాక్‌, Peach Fuzz రంగుల్లో కొనుగోలు చేయవచ్చని తెలిసింది.

వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు : మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ కర్వడ్‌ OLED డిస్‌ప్లే సహా పంచ్‌హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలతో వస్తుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 5X ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యం కలిగిన 75mm పెరిస్కోపిక్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు ఆటోఫోకస్‌ లెన్స్‌లను కలిగి ఉంది.

మూడు OS అప్‌డేట్లు.. :
దీంతోపాటు ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 3 సంవత్సరాలపాటు OS అప్‌గ్రేడ్‌లను పొందనుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌ సెట్‌ మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరియు పైన తెలిపిన కొన్ని స్పెసిఫికేషన్లపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Ultra Smartphone design and specs leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X