50MP+ 50MP+ 64MP కెమెరాలు, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో మోటోరోలా 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
మోటోరోలా నుంచి ఇవాళ భారత్ మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 50 Ultra Smartphone Launched) విడుదల అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భాగంగా భారత్‌లో ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. తాజాగా హైఎండ్ మోడల్‌గా అల్ట్రా వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఉన్న హ్యాండ్‌సెట్‌ల కంటే ఈ అల్ట్రా మోడల్ అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు FSC సర్టిఫికేషన్ కలిగిన చెక్కతో (Wooden) రూపొందించిన ప్యానల్‌ను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌పోన్ 6.7 అంగుళాల FHD+ 10 బిట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్, 2500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR 10+ సపోర్టు సహా కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.

ఈ మోటోరోలా అల్ట్రా మోడల్ ఆండ్రాయిడ్ 14 (అవుట్ ఆఫ్ ది బాక్స్) OS ను కలిగి ఉంది. మరియు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. మరియు Adreno 735 GPU తో జతచేయబడి ఉంటుంది. 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీ లాంచ్ అయింది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా సహా 50MP అల్ట్రావైడ్ ఆటో ఫోకస్ లెన్స్ మరియు 3x జూమింగ్‌తో 64MP పొర్ట్రెయిట్ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు ముందువైపు 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా మోడల్ 125W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ కేవలం 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ మోటో AI సహా అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ ట్రాకింగ్, యాక్షన్ షాట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. డాల్బీ ఆట్మాస్ సపోర్టును కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ప్రారంభ, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరో రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్ ధర రూ.49,999 గా ఉంటుంది. జూన్ 24 నుంచి సేల్ ప్రారంభం అవుతుంది. మోటోరోలా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్ 5.4, వైఫ్ 7, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు, డ్యూయల్ సిమ్ సపోర్టును కలిగి ఉంది. 5G, 4G, 3G, 2G వంటి నెట్‌వర్క్‌లను సపోర్టు చేస్తుంది. మరియు GPS, AGPS, LTEPS, SUPL సహా మరిన్ని లొకేషన్ సర్వీసులను అందిస్తుంది.


Click it and Unblock the Notifications