మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో వచ్చేస్తున్నాయ్.. 1.5K డిస్‌ప్లే, 90W ఛార్జింగ్, 50MP కెమెరా వంటి ఫీచర్లు లీక
Motorola Edge 60, 60 Pro Launch : మోటోరోలా కంపెనీ మరోసారి దుమ్ము రేపడానికి సిద్ధమవుతోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ విడుదల చేసిన వెంటనే, ఇప్పుడు ఏకంగా రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి దించేందుకు రెడీ అయిపోయింది. అవే మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో. ఈ రెండు ఫోన్లూ చైనాలోని టెనా (TENAA) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. దాంతో వాటికి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లు, డిజైన్ వివరాలు అన్నీ బయటకు వచ్చేశాయి.
గతంలో వచ్చిన మోడళ్ల కంటే ఈ ఫోన్లు చాలా అప్‌గ్రేడ్ అయి ఉంటాయని తెలుస్తోంది. కొత్త డిజైన్, పెద్ద బ్యాటరీ, ఇంకా అదిరిపోయే కెమెరాలు ఇందులో ఉండబోతున్నాయి. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

* డిజైన్, మోడల్ నంబర్లు
టెనా లిస్టింగ్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 మోడల్ నంబర్ XT2505-4 గా, అలాగే ఎడ్జ్ 60 ప్రో మోడల్ నంబర్ XT2507-5 గా కనిపిస్తున్నాయి. ఈ రెండు ఫోన్ల వెనుక డిజైన్ మాత్రం చాలా బాగుంది. వెనుకవైపు కెమెరాలు చతురస్రాకారపు గుండ్రటి (Squircle-shaped) బాక్స్‌లో అమర్చారు. అది ఫోన్ వెనుక ప్యానెల్‌లో కలిసిపోయినట్టుగా స్టైలిష్‌గా ఉంది.
ఆ బాక్స్‌లో మొత్తం నాలుగు రంధ్రాలు ఉన్నాయి. వాటిలో మూడు కెమెరాలు కాగా, ఒకటి ఫ్లాష్ లైట్ అయ్యుంటుంది. ఇంకా మోటోరోలా ఫోన్లకి ఉండే సిగ్నేచర్ 'మోటో డింపుల్' (Moto dimple) కూడా వెనుకవైపు ఉంది. దీనివల్ల ఫోన్‌కి ప్రత్యేకమైన లుక్ వస్తుంది.
* డిస్‌ప్లే ఎలా ఉండబోతోంది..
మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో రెండూ కూడా 6.67-అంగుళాల కర్వ్డ్ OLED స్క్రీన్‌తో వస్తాయని సమాచారం. ఈ స్క్రీన్లు 1.5K రిజల్యూషన్‌తో చాలా షార్ప్‌గా ఉంటాయి. అంతేకాదు, 10-బిట్ కలర్ సపోర్ట్‌తో 1.07 బిలియన్ రంగులను చూపిస్తాయి. ఇంకా స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కర్వ్డ్ ఎడ్జ్‌లు ఉండటంతో ఫోన్ ప్రీమియమ్‌గా కనిపిస్తుంది.
* బ్యాటరీ, ఛార్జింగ్
మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ (నిజానికి 5,335mAh రేటెడ్ కెపాసిటీ) ఉంటుందని తెలుస్తోంది. ప్రో మోడల్‌లో 6,000mAh బ్యాటరీ (5,820mAh రేటెడ్ కెపాసిటీ) ఉండొచ్చు. ఛార్జింగ్ విషయానికొస్తే, ఎడ్జ్ 60 ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయవచ్చు. అదే ఎడ్జ్ 60 ప్రో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుందట.
* పర్ఫార్మెన్స్, ప్రాసెసర్లు
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో వస్తుందని సమాచారం. ఇది 3.35GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి పనులన్నీ స్పీడ్‌గా నిర్వహిస్తుంది. ఎడ్జ్ 60 ఫోన్ 2.5GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుందని లిస్టింగ్‌లో ఉంది. అయితే, ఏ చిప్‌సెట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
* కెమెరా సెటప్ ఎలా ఉండబోతోంది?
ఈ రెండు ఫోన్లలో కెమెరాలు అదిరిపోతాయి. ఎడ్జ్ 60 ఫోన్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉండొచ్చు. అవి 50MP మెయిన్ కెమెరా, 10MP కెమెరా, 50MP కెమెరా సెన్సార్లు. వీటిలో ఒక కెమెరా 3x టెలిఫొటో జూమ్‌ను సపోర్ట్ చేస్తుందట. ముందు కెమెరా కూడా 50MP తో వస్తుందట.
ఎడ్జ్ 60 ప్రోలో వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా క్లియర్‌గా వస్తాయి.మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ 161.2 x 73.08 x 7.95mm కొలతలతో, 180.4 గ్రాముల బరువుతో ఉండవచ్చు.
ఎడ్జ్ 60 ప్రో కొంచెం పొడవుగా, సన్నగా ఉంటుంది. దీని కొలతలు 171.3 x 73.99 x 7.25mm, బరువు 188 గ్రాములు. రెండు ఫోన్లు కూడా పట్టుకోవడానికి తేలికగా, చూడటానికి స్టైలిష్‌గా ఉంటాయి. యువత నుంచి పెద్దవారి వరకు, మగవారి నుంచి ఆడవారి వరకు ఎవరైనా సరే వీటిని కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.
* ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు
టెనా లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్లు చాలా ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లతో రావచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 6GB, 8GB, 12GB, 16GB ర్యామ్ వేరియంట్లలో, అలాగే 128GB నుంచి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండొచ్చు. ప్రో వెర్షన్ 8GB, 12GB, 16GB ర్యామ్ ఆప్షన్లతో, స్టోరేజ్ ఆప్షన్లు సేమ్ రేంజ్‌లో ఉండొచ్చు.
* ఎప్పుడు లాంచ్ అవుతాయి..
మోటోరోలా గతంలో ఎడ్జ్ 50 ప్రోను ఇండియాలో ఏప్రిల్‌లో, ఎడ్జ్ 50ని ఆగస్టులో విడుదల చేసింది. ఇప్పుడు ఎడ్జ్ 60 సిరీస్ చైనాలో సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది కాబట్టి, లాంచ్ దగ్గరలోనే ఉండొచ్చు. త్వరలోనే ఈ మోడళ్లు ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








