మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ, సేల్, ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్..!
భారత్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌గా మోటోరోలా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాప్‌పిష్ మోడల్స్ వరకు అనేక ఫోన్‌లు ఉన్నాయి. త్వరలో మరిన్ని హ్యాండ్‌సెట్‌లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే వచ్చిన వివరాల ఆధారంగా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా వివిధ మోడల్స్‌ను విడుదల చేయనున్నారు. వీటితోపాటు G సిరీస్ స్మార్‌ఫోన్‌లు కూడా విడుదల కానున్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Fusion 5G) విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం మే నెలలో లాంచ్ అయిన ఎడ్జ్ 50 ఫ్యూజన్ తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులో రానుందని సమాచారం. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ డేట్, ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటికే ఫ్యూజన్ సిరీస్ విడుదలపై మోటోరోలా టీజర్‌ను విడుదల చేసింది.

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన వివరాలను లీక్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపారు. మరియు ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో (అండర్ ది హుడ్) పనిచేస్తుందని తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా మిలిటరీ గ్రేడ్ MIL- STD 810 తో రూపొందించినట్లు చెప్పారు. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కెమెరా విభాగం పరంగా ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT700 ప్రైమరీ కెమెరాతోపాటు 13MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలిపారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఈ స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీతో పనిచేస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ సిరీస్ ఏప్రిల్ 2 వ తేదీన భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుందని అంచనా వేశారు. మరియు ఏప్రిల్ 9 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుందని తెలిపారు. అయితే ఈ వివరాలపై మోటోరోలా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర యూరోపియన్ మార్కెట్‌లో EUR 350 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.33,100) గా ఉంటుందని తెలిసింది.మోటోరోలో ఫోన్ లైట్ బ్లూ, సాల్మన్, లావెండర్ వంటి కలర్ వేరియంట్స్‌లో లభిస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
* ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం మే నెలలో విడుదల అయింది. విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ pOLED 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. 68W టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా (OIS) + 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని మోటోరోలా తెలిపింది.


Click it and Unblock the Notifications








