5500mAh బ్యాటరీ, బెస్ట్ వాటర్ ప్రూఫ్, 50MP సోనీ కెమెరా 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా ఇటీవల ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Fusion 5G Smartphone Sale) లాంచ్ అయింది. ఈ ఫోన్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ హ్యాండ్‌సెట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సె్స్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ పాంటోన్ అమెజోనైట్, పాంటోన్ జెఫిర్, పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K ఆల్ కర్వడ్ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. మరియు ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హానికలగకుండా ఉండేందుకు SGS Low Blue లైట్, Low Motion బ్లర్ సర్టిఫికేషన్, పాంటోన్ ట్రూ కలర్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఉన్నాయి. ఈ ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజుల మన్నికను పొందవచ్చు.
చిప్‌సెట్, OS :
మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 256GB uMCO స్టోరేజీని సపోర్టు చేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
కెమెరాలు :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా f/1.8 అపేచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరాతో విడుదల అయింది. మరియు 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలతో 4K వీడియో రికార్డ్ చేయవచ్చు.
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ స్మార్ట్ కనెక్ట్ 2.0, మోటో సెక్యూర్ 3.0, ఫ్యామిలీ స్పేస్ 3.0, మోటో గెశ్చర్స్ తోపాటు Moto AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ టచ్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతో తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
ఈ ఫోన్ 68W వైర్ టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, AGPS, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications