ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 వేల డిస్కౌంట్.. 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 256GB స్టోరేజీ 5G ఫోన్..!
మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, టర్బో ఛార్జింగ్ సపోర్టు వంటి ఆకట్టుకొనే ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు మెరుగైన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
రూ.2 వేల డిస్కౌంట్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో భాగంగా రూ.2 వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది.

10 శాతం డిస్కౌంట్ :
ఫలితంగా ఈ ఫోన్‌ల ధరలు ప్రస్తుతం రూ.20,999, రూ.22,999 గా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.20 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో అందుబాటులో ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 6.7 అంగుళాల 1.5K ఆల్ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ఈ డిస్‌ప్లే HDR10+, వాటర్ టచ్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడిచేతులతోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ పొందుతుంది. ఈ డిస్‌ప్లే మరిన్ని సర్టిఫికేషన్లను కూడా కలిగి ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని మోటోరోలా హామీ ఇచ్చింది.
సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
టర్బో ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ 68W వైర్ టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ అనేక మోటో AI ఫీచర్‌లతో అందుబాటులో ఉంది. వీటితోపాటు మోటో గెశ్చర్స్, స్మార్ట్ కనెక్ట్, ఫ్యామిలీ స్పేస్ వంటి ఫీచర్లున్నాయి. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







