Home
Mobile

బెస్ట్ వాటర్‌ ప్రూఫ్‌ డిజైన్, 5500mAh బ్యాటరీ, 256GB స్టోరేజీ, Moto AI ఫీచర్‌లతో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!

మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Fusion Smartphone) భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతోపాటు ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. మరియు అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB uMCO స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది.

Motorola Edge 60 Fusion

ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ తో లాంచ్‌ అయింది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

డిస్‌ప్లే :
మోటోరోలా హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల 1.5K (1220*2712 పిక్సల్స్‌) ఆల్‌ కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Motorola Edge 60 Fusion

ఈ ఫోన్ స్క్రీన్‌ HDR10+, వాటర్‌ టచ్‌ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. SGS Low Blue లైట్‌, Low Motion బ్లర్ సర్టిఫికేషన్‌, పాంటోన్‌ ట్రూ కలర్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT700C ప్రైమరీ కెమెరా మరియు f/2.2 అపేచర్‌తో 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు f/2.2 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 68W వైర్‌ టర్బో ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో ఎఫెక్ట్‌ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, AGPS, NFC వంటి ఫీచర్‌లున్నాయి.

ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ Moto AI ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు మోటో సెక్యూర్‌ 3.0, స్మార్ట్‌ కనెక్ట్ 2.0, ఫ్యామిలీ స్పేస్‌ 3.0, మోటో గెశ్చర్స్ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 8GB/256GB వేరియంట్‌ ధర రూ.22999 గా ఉంది. అదే 12GB/256GB వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ఏప్రిల్‌ 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. పాంటోన్‌ స్లిప్‌స్ట్రీమ్‌, పాంటోన్‌ అమెజోనైట్‌, పాంటోన్‌ జెఫిర్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Motorola Edge 60 Fusion smartphone launched with 5500mAh Battery all curved pOLED Display in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X