Home
Mobile

మూడు కెమెరాలు, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్, టర్బో ఛార్జింగ్‌ సపోర్టు 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్!

Motorola Edge 60 Fusion Smartphone : మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లో గత నెలలో మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ప్రీమియం ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్‌ కానుందని లీక్స్‌ వస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ రూ.25 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గత సంవత్సరం లాంచ్‌ అయిన ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ మోడల్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ విడుదల సమయంలో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉండేది. ప్రస్తుతం రూ.1000 డిస్కౌంట్‌తో రూ.23999 కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో 8GB/256GB వేరియంట్ ధర రూ.22999 గా ఉండగా ప్రస్తుతం రూ.21999 కే సొంతం చేసుకోవచ్చు.

Motorola Edge 60 Fusion now under Rs19999

రూ.19999 ప్రారంభ ధరకు :
ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.19999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 6.7 అంగుళాల 1.5K ఆల్‌ కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

IP68 + IP69 రేటింగ్‌ :
ఈ డిస్‌ప్లే Low Motion బ్లర్ సర్టిఫికేషన్‌, SGS Low Blue లైట్‌, పాంటోన్‌ ట్రూ కలర్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వాటర్‌ టచ్‌ 3.0 సపోర్టును కలిగి ఉంది. అంటే తడిచేతులతోనూ వినియోగించుకోవచ్చు. దీంతోపాటు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP68 + IP69 రేటింగ్‌ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
మోటో ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని పొందుతోంది.

5500mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ ప్యామిలీ స్పేస్‌ 3.0, మోటో సెక్యూర్‌ 3.0, మోటో గెశ్చర్స్‌, మోటో స్మార్ట్ కనెక్ట్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌ కూడా ఉంది. మోటో ఫోన్‌ 68W వైర్‌ టర్బో ఛార్జింగ్‌ తో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలున్నాయి. ఇందులో (OIS) ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా ఉంది. 13MP అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సర్‌ ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోన్‌ అమెజోనైట్‌, పాంటోన్‌ జెఫిర్‌, పాంటోన్‌ స్లిప్‌స్ట్రీమ్‌, పాంటోన్‌ మైకనోస్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 60 Fusion smartphone now under Rs20000 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X