Home
Mobile

5500mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 256GB స్టోరేజీ, ట్రిపుల్‌ కెమెరాలతో మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా భారత్ మార్కెట్‌లో రేపు (ఏప్రిల్ 2) కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ (Motorola Edge 60 Fusion Smartphone) పేరుతో విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, డిజైన్‌ విడుదల అయింది.

బెస్ట్ ఫీచర్‌లు :
మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను ఇప్పటికే సంస్థ విడుదల చేసింది. దీని ఆధారంగా డిజైన్ ఆకట్టుకుంటుంది. మరియు కర్వడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లతో లాంచ్‌ కానుంది.

Motorola Edge 60 Fusion Smartphone

డిస్‌ప్లే వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. HDR10+ ను సపోర్టు చేస్తుంది. 96.3 స్క్రీన్ టూ బాడీ రేషియో ను కలిగి ఉంది.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్‌ MIL 810H, SGS Eye కేర్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నికతోపాటు కళ్లకు హాని కలగకుండా ఉంటుంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

Motorola Edge 60 Fusion Smartphone

ప్రాసెసర్‌ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ Adreno ను కూడా కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంటుంది. 3 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభించనుంది. మరియు మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. AI Magic Eraser, AI Magic Editor, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంటాయి.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా బెస్ట్‌ ఫీచర్‌లను జత చేసినట్లు మోటోరోలా చెబుతోంది. వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌, మరో మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ 68W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో లాంచ్‌ కానుంది. మరియు IP68 + IP69 రేటింగ్‌ తో కూడిన మెరుగైన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా నీటిలో తడిచినా డ్యామేజీ అయ్యే అవకాశం లేదు.

ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు మెరుగైన సౌండ్‌ అపుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని సమాచారం. కనెక్టివిటీ పరంగా 5G, 4G, తోపాటు మోటో సెక్యూర్ 3.0, స్మార్ట్‌ కనెక్ట్ 2.0, మోటో గెశ్చర్స్‌, ఫ్యామిలీ స్పేస్‌ 3.0 వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Motorola Edge 60 Fusion Smartphone with 5500mAh Battery triple Camera launching on tomorrow in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X