Home
Mobile

5500mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే, మూడు కెమెరాలు, స్మార్ట్‌ ఫీచర్‌లతో మోటోరోలా 5G స్మార్ట్‌ఫోన్‌..!

మోటోరోలా నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌ లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక లీక్స్‌ వచ్చాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజర్‌ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Fusion Smartphone) భారత్‌ లో ఏప్రిల్ 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ లావెండర్‌, లైట్‌ బ్లూ, సాల్మన్‌ (లైట్‌ పర్పుల్) వంటి మూడు రంగుల్లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.

Motorola Edge 60 Fusion Smartphone display

మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ పరంగా ఆకట్టుకుంటోంది. 6.7 అంగుళాల 1.5K పాంటోన్‌ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 96.3 స్క్రీన్‌ టూ బాడీ రేషియో, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రానుంది.

ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు హానికలగకుండా ఉండేలా SGS ఐ కేర్ ఫీచర్‌తో లాంచ్ కానుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i రక్షణను పొందుతుంది. ఈ ఫోన్‌ MIL-810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మోటో సెక్యూర్‌ 3.0, స్మార్ట్‌ కనెక్ట్ 2.0, ఫ్యామిలీ స్పేస్‌ 3.0 మరియు మటో గెశ్చర్స్‌ వంటి ఫీచర్స్‌ను సపోర్టు చేస్తుంది.

Motorola Edge 60 Fusion Smartphone display

చిప్‌సెట్ వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉందని మోటోరోలా తెలిపింది.

4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్‌ మోటో AI సూట్‌ సహా గూగుల్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, AI Magic Editor, AI Magic Eraser వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello OS ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా ఫీచర్‌లు :
ఈ ఫోన్‌ స్క్వేరిష్‌ డిజైన్‌తో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. మూడు కెమెరా లెన్స్‌లతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ను గమనించవచ్చు. 50MP సోనీ LYT700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, మరో మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ కెమెరా 4k వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ 68W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే మెరుగైన వాటర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్‌ కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 60 Fusion Smartphone with triple camera and AI features launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X