Motorola Edge 60 Fusion Vs Nothing Phone 3a రూ.25 వేల కంటే తక్కువ ధరలో ఈ రెండింటిలో ఏది బెస్ట్!
భారత్ మార్కెట్‌లో రూ.25000 ధర సెగ్మెంట్‌లో ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ఫోన్‌లకు భారీ డిమాండ్ కూడా ఉంటోంది. అందువల్ల ఈ సెగ్మెంట్‌లో అనేక వివిధ మోడల్స్‌ను స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇదే ధరలో నథింగ్ ఫోన్ 3a కూడా (Motorola Edge 60 Fusion Vs Nothing Phone 3a) అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు ఫోన్‌లలో ఏయే కేటగిరీల్లో ఏ హ్యాండ్‌సెట్ బెస్ట్‌గా ఉందో చూద్దాం.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఈ నెల తొలి వారంలో విడుదల కాగా.. నథింగ్ ఫోన్ 3a ఫోన్ గత నెల తొలివారంలో అందుబాటులోకి వచ్చింది. మోటోరోలా ఫోన్ ప్రారంభ ధర రూ.22,999 గా ఉంది. అదే నథింగ్ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది.

డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K ఆల్ కర్వడ్ pOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. మరియు ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
నథింగ్ ఫోన్ 3a హ్యాండ్‌సెట్ 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌తో లాంచ్ అయింది. Panda గ్లాస్ రక్షణను పొందుతుంది.
రెండు ఫోన్‌లు సుమారుగా ఒకే సైజు డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. అయితే మోటోరోలా ఫోన్ ఆల్ కర్వడ్ డిస్‌ప్లేతో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. మరియు బ్రైట్‌నెస్ కూడా ఎక్కువగా ఉంది.
ప్రాసెసర్ :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB uMCO స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
నథింగ్ స్మార్ట్‌ఫోన్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
ఈ రెండు ఫోన్‌లు కూడా ఈ ధరలో బెస్ట్ చిప్‌సెట్‌లనే కలిగి ఉన్నాయి. మరియు రెండు ఫోన్‌లు 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందిస్తున్నాయి.
కెమెరా :
మోటోరోలా ఫోన్ వెనుక వైపు f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT700C ప్రైమరీ OIS కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ f/2.2 అపేచర్‌తో 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3 ఇన్ 1 లైట్ సెన్సార్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
నథింగ్ ఫోన్ f/1.88 అపేచర్‌తో 50MP శాంసంగ్ ప్రైమరీను కలిగి ఉంది. ఈ కెమెరా OIS, EIS సపోర్టును కలిగి ఉంది. 2X ఆప్టికల్ జూమ్, 30X డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా EIS సపోర్టుతో వచ్చింది. మరియు 8MP సోనీ అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
కెమెరా విభాగం పరంగాను రెండు ఫోన్ బెస్ట్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అయితే నథింగ్ ఫోన్ వెనుక వైపు రెండు 50MP కెమెరాలను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.
బ్యాటరీ :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 68W వైర్ టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. నథింగ్ ఫోన్ నథింగ్ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండు ఫోన్‌లు ఒకటే సామర్థ్యం కలిగిన బ్యాటరీలను కలిగి ఉన్నా.. మోటో ఫోన్ 68W టర్బో ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఫలితంగా నథింగ్ ఫోన్‌తో పోలిస్తే మోటోరోలా ఫోన్ వేగంగా ఛార్జింగ్ కానుంది.
మోటోరోలా ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అదే నథింగ్ ఫోన్ IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్ కావాలనుకొనే వారు మోటో వైపు మొగ్గు చూపవచ్చు.
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ అనేక Moto AI ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు సర్కిల్ టూ సెర్చ్ వంటి ఏఐ ఫీచర్‌లను కూడా సపోర్టు చేస్తుంది. నథింగ్ ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్ సౌండ్ సహా అనేక ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. అయితే మోటో మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.
ధర :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యా్‌మ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది.
నథింగ్ ఫోన్‌తో పోలిస్తే మోటోరోలా ఫోన్ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ ఫోన్ సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాంకు డిస్కౌంట్‌లతో రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.20999 కే మోటో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications







