టెలిఫోటో కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 68W టర్బో ఛార్జింగ్ సపోర్టుతో స్మార్ట్‌ఫోన్..!
Motorola Edge 60 Neo Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి మరో ఫోన్ లాంచ్ అయింది. మోటోరోలా ఎడ్జ్ 60 నియో పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. మరియు IP69 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8.09mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు 175 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ మోటో ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
మోటోరోలా ఎడ్జ్ 60 నియో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
మోటోరోలా హ్యాండ్‌సెట్ 6.4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 నియో స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP మ్యాక్రో లెన్స్ మరియు 3x ఆప్టికల్ జూమ్, 30x సూపర్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 నియో స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర EUR 399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.41,148 గా ఉంటుంది). ప్రస్తుతం ఈ ఫోన్ యూరోప్‌లోనే అందుబాటులోకి రానుంది. అయితే భారత్ మార్కెట్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.
* మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో గత నెలలో విడుదల అయిన మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 3 ఇన్ 1 ఫ్లిక్కర్ సెన్సర్ మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








