Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. పూర్తి వివరాలు

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ గత వారంలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ మిడ్‌ రేంజ్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల చేశారు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర, సేల్‌ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 60 Pro Smartphone Sale) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.33999 గా ఉంది.

Motorola Edge 60 pro Smartphone sale

ఈ ఫోన్‌ను మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌ motorola.in, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్ట్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోన్‌ డాజ్లింగ్‌ బ్లూ, పాంటోన్‌ షాడో, పాంటోన్‌ స్పార్కింగ్‌ గ్రేప్‌ వంటి కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల 1.5k (1220x2712 పిక్సల్స్‌) క్వాడ్‌ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 446 ppi పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 Extreme SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్‌, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90W టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు ఈ ఫోన్‌ 5w రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టు, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT 700c ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ యాంగిల్‌ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 50MP కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6E, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

FAQs
ఈ ఫోన్‌ ఎన్ని సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను అందిస్తుంది?

ఈ ఫోన్ మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్‌ వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉందా?

అవును, ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన బెస్ట్ డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 60 pro Smartphone with 6000mAh battery sale started on flipkart and moto website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X