Home
Mobile

50MP సోనీ కెమెరా, 68W ఛార్జింగ్‌ సపోర్టు, 6.7 అంగుళాల డిస్‌ప్లే మోటోరోలా ఫోన్‌.. పూర్తి వివరాలు..!

మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌, ఎడ్జ్‌ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే భారత్‌ మార్కె్‌ట్‌లో లాంచ్‌ అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో హ్యాండ్‌సెట్‌ ఏప్రిల్‌ 24న విడుదల కానుంది. అయితే తాజాగా మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 60 Smartphone) గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్‌ Evan Blass (@evleaks) తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.

మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌ :
టిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా మోటోరోలా ఎడ్జ్‌ 60 డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. గత సంవత్సరం విడుదల అయిన ఎడ్జ్‌ 50 మోడల్ తర్వాత తరం వెర్షన్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Motorola Edge 60 Smartphone

స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K (2712*1220 పిక్సల్స్‌) pOLED డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 15 (Out of the box) ఆధారిత OS ను కలిగి ఉండే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP సోనీ LYT 700c ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇతర కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్ 68W ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

* ఇటీవల భారత్‌ మార్కెట్‌లో విడుదల అయిన మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K 2.5D pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI Skin OS ను కలిగి ఉంది. Moto AI ఫీచర్‌లతోపాటు Adobe Doc స్కాన్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. 68W వైర్‌, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సార్‌తోపాటు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. ఏప్రిల్ 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Motorola Edge 60 Smartphone key specifications and features leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X