50MP + 50MP + 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ, అదిరిపోయే డిజైన్‌తో మోటోరోలా ఫోన్..!
మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రో మోడల్ ప్రస్తుతానికి హై ఎండ్ వేరియంట్ గా ఉంది. త్వరలో ఈ సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
భారత్ మార్కెట్ లో మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Launch Date) జూన్ 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలతో ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఇప్పటికే లైవ్‌లో ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు! :
ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ( 2712 x 1220 పిక్సల్స్ ) 1.5K క్వాడ్ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది.
చిప్‌సెట్ వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమింగ్ తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వస్తుంది.
5500mAh బ్యాటరీ వివరాలు :
దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ కేవలం 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. కొన్ని లీక్స్ ఆధారంగా రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్య ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టు, 3.0 SGS ఐ కేర్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ pantone Gibraltar sea, pantone shamrock వంటి రెండు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications