రూ.25 వేల ధరలో లేటెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. మూడు 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ తో 5G ఫోన్ విడుదల..!
Motorola Edge 60 Smartphone : మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల అయింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా లాంచ్ అయిన ఎడ్జ్ 60 మోడల్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీతోపాటు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ కలర్ వేరియంట్స్‌తోపాటు డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5K pOLED క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. మరియు 96.32 స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.

ఈ డిస్‌ప్లే స్నార్ట్ వాటర్ టచ్ 3.0 టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా తడి చేతులతోనూ సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. SGS Low లైట్, మోషన్ బ్లర్ రిడక్షన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌తో కూడిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
మిలిటరీ గ్రేడ్ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్మా్ర్ట్‌ఫోన్ 68W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మోటో AI 2.0 సూట్ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్మా్ర్ట్‌ఫోన్ ధర, సేల్ :
మోటోరోలా ఎడ్జ్ 60 స్మా్ర్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది. జూన్ 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ఫోన్ ను రూ.24999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ షామ్‌రాక్ కలర్ ఆప్షన్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications