Home
Mobile

మూడు 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ. 6.7 అంగుళాల డిస్‌ప్లే, వాటర్‌ ప్రూఫ్‌ డిజైన్‌తో 5G ఫోన్‌.. ఇవాళే విడుదల

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌ లో భాగంగా ఇప్పటికే ఫ్యూజన్‌, స్టైలస్‌, ప్రో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ విడుదల కానున్న ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్‌ గురించి అనేక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ డిజైన్‌, కలర్‌ వేరియంట్స్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Smartphone) 6.7 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ pOLED డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. వాటర్‌ టచ్‌ 3.0 SGS ఐ కేర్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.

motorola Edge 60 Smartphone

IP68 + IP69 రేటింగ్‌ :
ఈ డిస్‌ప్లే 10 బిట్‌, HDR10+, విజన్‌ బూస్టర్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ మోటో ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ ప్రూఫ్‌ గా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ పాంటోన్‌ Gibraltar sea, పాంటోన్‌ shamrock వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ప్రాసెసర్‌, OS వివరాలు :
మోటోరోలా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, మేజిక్‌ ఎరేజర్‌, మేజిక్‌ ఎడిటర్‌ వంటి అనేక AI ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

50MP + 50MP + 50MP కెమెరాలు :
ఈ ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 3x ఆప్టికల్ జూమింగ్‌తో 10MP టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి రానుంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 68W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మోటో సెక్యూర్‌ 3.0, స్మార్ట్‌ కనెక్ట్‌ 2.0, మోటో గెశ్చర్స్‌, ఫ్యామిలీ స్పేస్‌ 3.0 వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్స్‌ ఆధారంగా మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ రూ.35,000 నుంచి రూ.40,000 రేంజ్‌ ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Best Mobiles in India

English summary
motorola Edge 60 Smartphone launching today in india with triple 50MP Cameras
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X