రూ.25 వేల ధరలో 50MP + 50MP + 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌తో 5G ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Motorola Edge 60 Smartphone Sale : మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ గత వారం విడుదల అయింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో ఫోన్‌లతోపాటు గత వారం ఎడ్జ్ 60 ఫోన్ కూడా లాంచ్ అయింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. తొలి సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్మా్ర్ట్‌ఫోన్ కేవలం 12GB ర్యామ్ + 256GB స్టోరేజీలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ను రూ.24999 కే సొంతం చేసుకోవచ్చు.

రెండు కలర్ వేరియంట్స్ :
ఈ మోటోరోలా ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ షామ్‌రాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
చిప్‌సెట్ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ కోసం 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని మోటో తెలిపింది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ మోటో హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 1.5K pOLED క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 96.32 స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే SGS Low లైట్, మోషన్ బ్లర్ రిడక్షన్ సపోర్టును కూడా కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది.
మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 68W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే వాటర్ టచ్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు మోటో AI 2.0 సూట్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications