5000mAh బ్యాటరీ. 6.7 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో 5G ఫోన్..? లాంచ్ తేదీ లీక్
Motorola India : మోటోరోలా నుంచి ఇటీవల ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రేపటి నుంచి భారత్ మార్కెట్‌లో సేల్ ప్రారంభం కానుంది. బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.20999 ధరకు సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా మరో హ్యాండ్‌సెట్ కూడా త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబందించిన కీలక వివరాలు తాజాగా లీక్ అయ్యాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Stylus) త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. వచ్చే వారంలో లాండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. లాంచ్ వివరాలతోపాటు ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను కూడా X పోస్ట్ ద్వారా లీక్ చేశారు.

ఎప్పుడు విడుదల కానుంది? :
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 17 వ తేదీన విడుదల కానుంది. దీంతోపాటు ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో కూడా త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఈ రెండు మోడల్స్ వివరాలు లీక్ అయ్యాయి.
డిస్‌ప్లే, చిప్‌సెట్! :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అభిషేక్ యాదవ్ తెలిపారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో పాటు స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపారు.
Exclusive 🌟
— Abhishek Yadav (@yabhishekhd) April 8, 2025
Motorola Edge 60 Stylus Indian variant price.
💰 ₹22,999 (8GB+256GB)
Launch date: 17 April
Specifications:
✏️ Stylus (pen) included
📱 6.7" pOLED display
120Hz refresh rate
🔳 Qualcomm Snapdragon 7s Gen 2 chipset
🍭 Android 15
📸 50MP+ 13MP rear camera
🤳 32MP…
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 13MP సెకండరీ కెమెరాను అమర్చి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 68W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర EUR 500 (భారత కరెన్సీ ప్రకారం రూ.43600) గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై మోటోరోలా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
భారత మార్కెట్‌లో ఏప్రిల్ 2 వ తేదీన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 1.5K ఆల్ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc చిప్‌సెట్‌తో పని చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT700C OIS కెమెరా, 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 3 ఇన్ 1 సెన్సార్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 68W వైర్ టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. మోటో సెక్యూర్ 3.0, స్మార్ట్ కనెక్ట్ 2.0, ఫ్యామిలీ స్పేస్ 3.0, మోటో గెశ్చర్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








