మోటోరోలా నుంచి ఏప్రిల్ 15 న కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది.. ఫీచర్‌లు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!
మోటోరోలా నుంచి ఇటీవల ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. రూ.22999 ప్రారంభ ధరలో అందుబాటులోకి వచ్చింది. రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ సేల్ నిన్నటి నుంచి ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత్ మార్కెట్‌లో త్వరలో విడుదల కానున్నాయి.
మోటో ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
తాజాగా వచ్చిన లీక్స్ ఆధారంగా మోటో ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ ప్రీమియం ఫ్లక్స్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే సన్నని బెజెల్స్ తో కూడిన కర్వడ్ OLED ప్యానల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. క్విక్ యాక్సె్స్, షార్ట్ కట్స్ కోసం ప్రత్యేక బటన్‌ను అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మోటో ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ మోటో హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేసే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ ప్రో మోడల్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, మరియు 10MP మరో లెన్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు 20MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.31999 గా ఉండే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం వెల్లడి కాలేదు. ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరియు స్పెసిఫికేషన్‌లు. ఫీచర్‌ల పైనా మోటో ఎటువంటి ప్రకటన చేయలేదు.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 15 వ తేదీన విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ నిర్వహించనున్నారు. ఈ ఫోన్ స్లిమ్ బెజెల్స్, పంచ్ హోల్ కటౌట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ వెనుక వైపు వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. మరియు స్వేర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYTIA 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ లెన్స్‌తో లాంచ్ కానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను కలిగి ఉంటుంది.
Meet the all-new #MotorolaEdge60STYLUS — where precision meets personality, and creativity comes with a snap.The segment’s first built-in stylus lets you go from spark to standout in one smooth https://t.co/1F3MPcBSsO that’s how you Flex
— Motorola India (@motorolaindia) April 10, 2025
#Motorola
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ (Motorola edge 60 stylus) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ర్యామ్ వివరాలు వెల్లడి కాలేదు. అయితే 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 15W వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టు, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుంది. మరియు మిలిటరీ గ్రేడ్ MIL STD డ్యూరబిలిటీ తో రానుంది.
ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్ పాంటోన్ సర్టిఫైడ్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్టును కలిగి ఉంటుంది. మోటో AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర వివరాలు వెల్లడి కాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న లీక్స్ ఆధారంగా మోటో ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉండే అవకాశం ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
ఇటీవల అందుబాటులోకి వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల 1.5K ఆల్ కర్వడ్ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజుల మన్నికను పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI తో పనిచేస్తోంది. స్మార్ట్ కనెక్ట్ 2.0, మోటో సెక్యూర్ 3.0, ఫ్యామిలీ స్పేస్ 3.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. వాటర్ టచ్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతో తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. మోటో AI ఫీచర్‌లన కలిగి ఉంది.
ఈ ఫోన్ 68W వైర్ టర్బో ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ OIS సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.


Click it and Unblock the Notifications








