Home
Mobile

Motorola Edge 60 Stylus స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఇన్‌బిల్ట్‌ స్టైలస్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, Moto AI ఫీచర్‌లు!

మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఇటీవల ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ19,999 కు అందుబాటులో ఉంటుంది. అదే సిరీస్ నుంచి ఇవాళ మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ హ్యాండ్‌సెట్‌ (Motorola Edge 60 Stylus Smartphone Launched) అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ఇన్‌ బిల్ట్ స్టైలస్‌ తో విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ట్రిపుల్‌ కెమెరా 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు 6.67 అంగుళాల 1.5K 2.5D pOLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

Motorola Edge 60 Stylus Smartphone launched

ఈ ఫోన్‌ SGS Low Blue లైట్‌ మరియు మోషన్ బ్లర్‌ రిడక్షన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 8GB/256GB వేరియంట్‌లోనే అందుబాటులోకి వచ్చింది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

Motorola Edge 60 Stylus Smartphone launched

ఈ మోటో ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI Skin పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని మోటోరోలా హామీ ఇచ్చింది. ఆడియో ట్రాన్సిక్రిప్షన్‌, అప్‌డేట్‌ సమ్మరీ వంటి అనేక Moto AI ఫీచర్‌లతోపాటు Adobe Doc స్కాన్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

మోటోరోలా హ్యాండ్‌సెట్ 68W వైర్‌, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆక్వా టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. కనెక్టివీట పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైపై 6, GPS, NFC, Glonass, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఏప్రిల్ 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను యాక్సెస్‌ బ్యాంకు, IDFC క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.1000 ఎక్స్చేంజీ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ pantone Gibraltar sea మరియు pantone Surf the web వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

Best Mobiles in India

English summary
Motorola Edge 60 Stylus Smartphone launched with inbuild Stylus and Snapdragon 7s Gen 2 Soc Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X