Home
Mobile

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, స్టైలస్‌, 50MP కెమెరా, వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్‌!

భారత్‌ మార్కెట్‌లో మోటోరోలా సంస్థ 2025 సంవత్సరంలో విడుదల చేసింది. ముఖ్యంగా ఎడ్జ్‌ సిరీస్‌ నుంచి నాలుగు ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో రూ.20 వేల ధరలో స్టైలస్‌ సపోర్టుతో మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. విడుదల ధరతో పోలిస్తే ఈ ఫోన్‌ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 1.5K డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు.

ధర, సేల్ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 60 Stylus Smartphone) ప్రస్తుతం మోటో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం రూ.20999 ధరకు అందుబాటులో ఉంది.

Motorola edge 60 Stylus 5G smartphone

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ Pantone Surf web, Pantone Gibraltar Sea రెండు రంగుల్లో లభిస్తోంది.

ఆక్వా టచ్ ఫీచర్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K 2.5D pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఆక్వా టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. తడి చేతులతోనూ ఉపయోగించుకోవచ్చు. కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతోంది.

50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్‌ మోటో ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. అడాబ్‌ స్కాన్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఫోన్‌ 68W వైర్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్‌ 5.4, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola edge 60 Stylus smartphone now available at Rs20999 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X