Home
Mobile

మిలిటరీ గ్రేడ్‌ డిజైన్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ Motorola Edge 60 Stylus ఫోన్ సేల్‌ ప్రారంభం..!

మోటోరోలా నుంచి ఇటీవల వరుసగా ఎడ్జ్‌ 60 సిరీస్‌ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ హ్యాండ్‌సెట్ సేల్‌ ఇప్పటికే సేల్‌ ప్రారంభం అయింది. గత వారం విడుదల అయిన మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ప్రధాన రిటైల్‌ స్టోర్స్‌లో (Motorola Edge 60 Stylus Smartphone Sale) కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ఇన్‌బిల్ట్‌ స్టైలస్‌ను కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో SBI, IDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే IDFC ఫస్ట్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపైనా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

MororolMotorola edge 60 stylus smartphone with IP68 Rating and inbuilt stylus sale is live in india telugu newsa edge 60 stylus smartphone

ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యండ్‌సెట్‌ Pantone Surf the web, Pantone Gibraltar sea రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K 2.5D pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ SGS Low Blue లైట్‌, మోషన్ బ్లర్‌ రిడక్షన్ సర్టిఫికేషన్‌లను కూడా కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే ఆక్వా టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. తడి చేతులతోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

MororolMotorola edge 60 stylus smartphone with IP68 Rating and inbuilt stylus sale is live in india telugu newsa edge 60 stylus smartphone

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI Skin ను కలిగి ఉంది.

ఈ మైక్రో SD కార్డుతో గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీ వరకు పెంచుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ మోటోరోలా మిడ్‌ రేంజ్ హ్యాండ్‌సెట్ 68W వైర్‌, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ Moto AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు Adobe Doc స్కాన్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G, WiFi 6, బ్లూటూత్‌ 5.4, GPS, NFC, Glonass, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Motorola edge 60 stylus smartphone with IP68 Rating and inbuilt stylus sale is live in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X