ఈ కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఎప్పుడు విడుదల కానుందంటే...!
Motorola Edge 70 Fusion Smartphone : మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడి కాగా.. తాజాగా విడుదల తేదీ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది? :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో మార్చి 6 వ తేదీన విడుదల కానుంది. మోటోరోలా X హ్యాండిల్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.

స్నాప్‌డ్రాగన్ చిప్, మూడు స్టోరేజీ వేరియంట్స్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే! :
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT 710 కెమెరా ఉంటుంది. ఈ కెమెరా లెన్స్ కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని మోటో చెబుతోంది. దీంతోపాటు 13MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది.

144Hz రీఫ్రెష్ రేట్, 5200 నిట్స్ బ్రైట్‌నెస్ :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల క్వాడ్ కర్వడ్ 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 96.2 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, HDR10+ కంటెంట్ ను సపోర్టు చేస్తుంది. SGS ఐ ప్రొటెక్షన్ ఫీచర్ ను కలిగి ఉంది.
7000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ కంట్రీ ఎయిర్, పాంటోన్ బ్లూ సర్ఫ్, పాంటోన్ సిల్హౌట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ లెదర్ తరహా టెక్చర్ ను కలిగి ఉంటుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.25 వేల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ మోటో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








