Home
Mobile

మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. లెదర్ ఫినిష్‌, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, 7000mAh బ్యాటరీ?

మోటోరోలా సంస్థ భారత్‌ మార్కెట్‌ లో గత నెలలో మోటోరోలా సిగ్నేచర్‌ ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ ను తీసుకొచ్చింది. స్లిమ్‌ డిజైన్‌తోపాటు అనేక ప్రత్యేక ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. అయితే త్వరలో మోటో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ (Flipkart) ఆధారంగా భారత్‌ మార్కెట్‌ లో మోటో నుంచి కొత్త ఫోన్‌ లాంచ్ కానుంది. అయితే ఏ ఫోన్‌ విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే కొన్ని లీక్స్‌ ఆధారంగా మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion) పేరుతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Motorola Edge 70 fusion Smartphone teased in india

లెదర్‌ ఫినిష్‌, మూడు కలర్‌ వేరియంట్స్‌ :
ఈ ఫోన్ పాంటోన్‌ బ్లూ, సర్ఫ్‌, పాంటోన్‌ కంట్రీ ఎయిర్, పాంటోన్‌ సిల్హౌట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు లెదర్‌ టెక్చర్డ్ ఫినిష్‌ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

తర్వాత అప్‌డేట్స్‌ ఎప్పుడు వస్తుంది? :
ఈ మోటో ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఫిబ్రవరి 23 వ తేదీన వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే టిప్‌స్టర్‌ ఇవాన్‌ బ్లాస్‌ ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన అనేక వివరాలను లీక్‌ చేశారు. స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని తెలిపారు. 8GB, 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 16 OS పైన పనిచేసే అవకాశం ఉంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే :
ఈ లీక్స్ ఆధారంగా మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తోపాటు IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉండే అవకాశం ఉంది.

7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 68W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో లాంచ్ కానుందని ఇటీవల వచ్చిన కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలను టిప్‌స్టర్‌ డెబయాన్‌ రాయ్ అంచనా వేశారు. ఈ ఫోన్ వచ్చే రెండు వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ హ్యాండ్‌సెట్ రూ.25 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ వివరాలపై మోటోరోలా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Best Mobiles in India

English summary
Motorola Edge 70 fusion Smartphone teased in india here are the expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X