Home
Mobile

7000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 OS, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌తో మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌!

Motorola Edge 70 Fusion Smartphone : మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో ఈనెల 6 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్‌ మోటో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ చిప్‌సెట్‌, డిజైన్, కెమెరాలు సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ సపోర్టు వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
మోటోరోలా ఫోన్‌ లెదర్‌ ప్రేరణ పొందిన ఫ్యాబ్రిక్‌ ఫినిష్‌, కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బ్లూ సర్ఫ్‌, కంట్రీ ఎయిర్‌, సిల్హోటీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. MIL - 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

motorola edge 70 Fusion smartphone os updates

క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5K క్వాడ్‌ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 5200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ‌స్మార్ట్‌ వాటర్‌ టచ్‌ 3.0 ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే SGS ఐ ప్రొటెక్షన్‌తోపాటు HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌ :
ఈ మోటో ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మెరుగైన థర్మల్‌ కూలింగ్‌ కోసం వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ BGMI 120fps ను సపోర్టు చేస్తుందని మోటోరోలా చెబుతోంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
అయితే ఈ మోటో హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ Moto AI ఫీచర్లను కూడా అందిస్తుందని సంస్థ చెబుతోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు మోటో AI సపోర్టుతో 50MP సోనీ LYTIA 710 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్‌ సెన్సర్‌ ఉంటుంది. డెప్త్‌, మ్యాక్రో లెన్స్‌గానూ పనిచేస్తుంది. ఫోటోలు నేచురల్‌గా ఉండేలా ఈ కెమెరా సిస్టమ్‌ పాంటోన్‌ సర్టిఫికేషన్‌, నేచురల్‌ స్కిన్‌ టోన్‌లను కలిగి ఉంటుంది.

motorola edge 70 Fusion smartphone os updates

7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అన్ని కెమెరాలు 4k వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయని మోటోరోలా తెలిపింది. 68W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లూటూత్‌ 6.0, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌ మార్చి 6 వ తేదీన విడుదల కానుంది. అయితే అదే రోజు ఎర్లీ బర్డ్‌ సేల్‌ కూడా ప్రారంభం కానుంది. అయితే ఇందుకు సంబంధించిన ఆఫర్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ రూ.24000 నుంచి రూ.30000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
motorola edge 70 Fusion smartphone will receive 3 OS updates and upto 5 years of security updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X