ప్రపంచంలో ఈ కెమెరా కలిగిన తొలిఫోన్ ఇదే.. ఇవాళ్టి నుంచే సేల్.. రూ.2000 డిస్కౌంట్!
Motorola Edge 70 Fusion : మోటోరోలా సంస్థ భారత్ మార్కెట్‌లో ఈ నెల తొలివారంలో ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ సోనీ LYTIA 710 కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాతో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని మోటో తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 1.5 మీటర్ల లోతు నీటిలో ఉంచినా డ్యామేజీ కాదని చెబుతోంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
రూ.2000 డిస్కౌంట్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ను ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. మోటో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. Axis, HDFC బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.32,999 గా ఉంది. పాంటోన్ కంట్రీ ఎయిర్, పాంటోన్ బ్లూ సర్ఫ్, పాంటోన్ సిల్హౌటి కలర్స్‌లో లభిస్తుంది.
క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
ఈ మోటోరోలా ఫోన్ 6.78 అంగుళాల 1.5K సూపర్ HD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 5200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. ఐ కేర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

నీటిలోనూ డ్యామేజీ కాని ఫోన్ :
ఈ డిస్‌ప్లే స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ ఆపరేట్ చేయవచ్చు. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా 1.5 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాలు ఉన్నా డ్యామేజీ కాదని మోటో చెబుతోంది.
5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
మోటోరోలా హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 4473 mm Sq వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో (OIS) 50MP సోనీ LYTIA 710 ప్రైమరీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో లాంచ్ అయిన తొలిఫోన్ ఇదేనని మోటో తెలిపింది. 13MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 4K HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ ఆటో నైట్ విజన్, అడాప్టి్వ్ స్టెబిలైజేషన్, హైపర్ ల్యాప్స్, AI ఫోటో ఎన్‌హేన్స్‌మెంట్ ఫీచర్లతోపాటు AI Image Studio, Text to Sticker, Style Sync, Sketch to Image, ఆటో స్క్రీన్‌షాట్ బ్లర్, లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్లు ఉన్నాయి. 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. 68W టర్బోపవర్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








