Home
Mobile

30 నిమిషాలు నీటిలో ఉన్నా డ్యామేజీ కాని, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కలిగిన 5G ఫోన్‌ విడుదల..!

Motorola Edge 70 Fusion Lauch : భారత్‌ మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్‌ సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజర్‌ పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. సోనీ LYTIA 710 కెమెరాతో విడుదల అయిన తొలి ఫోన్ ఇదేనని మోటో చెబుతోంది. దీంతోపాటు స్మూత్‌ డిస్‌ప్లే, సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తోపాటు, 30 నిమిషాలపాటు 1.5 మీటర్ల నీటిలోతులో ఉంచినా ఫోన్‌ డ్యామేజీ కాదని ఫోన్‌ చెబుతోంది.

మోటోరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్‌ కర్వడ్‌ 6.78 అంగుళాల 1.5K సూపర్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 5200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 10 బిట్‌ కలర్‌ డెప్త్‌, 100 శాతం DCI P3 వైడ్‌ కలర్‌ గామట్‌, HDR10+ సర్టిఫికేషన్లు ఉన్నాయి.

Motorola edge 70 Fusion

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే SGS ఐ కేర్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ వాటర్ టచ్‌ ఫీచర్‌ ఉంది. ఈ ఫీచర్‌తో తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ ఫ్యాబ్రిక్‌ ఫినిష్‌ను కలిగి ఉంది. పాంటోన్‌ బ్లూ సర్ఫ్‌, పాంటోన్‌ కంట్రీ ఎయిర్, పాంటోన్‌ సిల్హౌటి కలర్స్‌లో లభిస్తుంది.

నీటిలోనూ డ్యామేజీ కాని ఫోన్! :
MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. -20 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత మధ్యలో పనిచేస్తుంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. 1.5 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాలపాటు ఉన్నా డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది.

Motorola edge 70 Fusion

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

తొలి ఫోన్‌ ఇదే! :
కెమెరా విభాగం పరంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్ f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో 50MP సోనీ LYTIA 710 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాను కలిగి ఉన్న తొలి ఫోన్‌ ఇదేనని మోటోరోలా సంస్థ చెబుతోంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరా ఉంది.

Motorola edge 70 Fusion

ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ అన్ని కెమెరాలతో 4K HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. అడాప్టి్వ్‌ స్టెబిలైజేషన్‌, పోర్ట్రోయిడ్‌ మోడ్‌, ఆటో నైట్ విజన్‌, హారిజన్‌ లాక్‌, హైపర్‌ ల్యాప్స్, AI ఫోటో ఎన్‌హేన్స్‌మెంట్‌ ఫీచర్లు ఉన్నాయి.

వీటితోపాటు మోటో AI 2.0 ఫీచర్లు కూడా ఉన్నాయి. AI Image Studio, Style Sync, Text to Sticker, Sketch to Image వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్‌ సెర్చ్‌, AI ప్లేలిస్ట్‌ స్టూడియో, ఆటో స్క్రీన్‌షాట్‌ బ్లర్‌, లైవ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సిలికాన్ కార్బన్‌ బ్యాటరీ :
ఈ ఫోన్‌ 68W టర్బోపవర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది. 4473 mm Sq వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూట్‌, వైఫై 6E, NFC ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32999 గా ఉంది. HDFC, Axis బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ ఫోన్ సేల్ మార్చి 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌ సహా ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్లిప్‌కార్ట్‌లో 'Early Bird' సేల్‌ నిర్వహించనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola edge 70 Fusion with snapdragon 7s gen 4 chip, sony LYTIA 710 camera launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X