Home
Mobile

మోటోరోలా నుంచి స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌.. కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ లో ఇటీవల సన్నని డిజైన్‌ కలిగిన ఫోన్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. అనేక సంస్థలు సన్నని డిజైన్‌ తో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌, ఐఫోన్‌ ఎయిర్‌, టెక్నో పోవా స్లిమ్‌ వంటి ఫోన్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్, ఆపిల్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ కేటగిరీలో సన్నని ఫోన్‌లను లాంచ్ చేయగా.. టెక్నో మాత్రం బడ్జెట్ రేంజ్‌ లో స్లిమ్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

లిస్టింగ్‌ ఆధారంగా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా త్వరలో మిడ్ రేంజ్‌ సెగ్మెంట్‌ లో స్లిమ్‌ ఫోన్‌ ను లాంచ్ చేయనుంది. మోటోరోలా ఎడ్జ్‌ 70 పేరుతో (Motorola Edge 70 Smartphone) ఈ ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్‌ సంబంధించిన స్పెసిఫికేషన్‌ల వివరాలు రిటైలర్‌ వెబ్‌సైట్‌ లిస్టింగ్‌ లో కనిపించాయి.

motorola edge 70 smartphone

ఎప్పుడు విడుదల కానుంది? :
మోటోరోలా ఎడ్జ్‌ 70 స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 5 వ తేదీన గ్లోబల్ మార్కెట్‌ లో విడుదల కానుంది. అయితే అంతకంటే ముందుగానే చైనాలో మోటో X70 ఎయిర్‌ పేరుతో లాంచ్ కానుందని భావిస్తున్నారు. భారత్‌ మార్కెట్‌ లోనూ ఈ మోటోరోలా స్లిమ్‌ ఫోన్‌ నవంబర్ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

1.5K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
లిస్టింగ్ ఆధారంగా మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది.

వైర్‌లైస్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ మోటోరోలా స్లిమ్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ 68W వైర్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ మోటో స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ 5G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, NFC వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 170 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ సిమ్‌ కార్డును సపోర్టు చేస్తుంది. eSIM ఆప్షన్‌ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే భారత్‌లో కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. దీంతోపాటు ఈ ఫోన్‌ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందో వెల్లడి కాలేదు. ధర వివరాలు కూడా వెల్లడి కాలేదు.

Best Mobiles in India

English summary
motorola edge 70 smartphone key specifications and features revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X