అల్ట్రా స్లిమ్ డిజైన్, వైర్‌లెస్ ఛార్జింగ్, 50MP + 50MP + 50MP కెమెరాలతో మోటోరోలా స్మార్ట్‌ఫోన్..!
Motorola Edge 70 Smartphone : మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయింది. అల్ట్రా స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్ తో లాంచ్ అయింది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ మోటోరోలా స్లిమ్ ఫోన్ భారత్ మార్కెట్ లో త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల 1.5K (2712 x 1220 పిక్సల్స్) 10 బిట్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ ఫోన్ కేవలం 5.99 mm థిక్‌నెస్, 159 గ్రాముల బరువుతో కూడిన అల్ట్రా స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్ తో లాంచ్ అయింది.
ఈ మోటో అల్ట్రా స్లిమ్ డిజైన్ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 58W వైర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 29 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ ను పొందవచ్చని మోటోరోలా చెబుతోంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది.
50MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు ఉన్న కెమెరాలతో 30fps వద్ద 4K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మోటో AI ఫీచర్ లను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్ లను కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ EUR 799 (భారత కరెన్సీ ప్రకారం రూ.81,384) గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ పాంటోన్ గ్యాడ్జెట్ గ్రే, పాంటోన్ లిలీ ప్యా్డ్, పాంటోన్ బ్రాంజ్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్ లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








