Home
Mobile

రేపు విడుదల కానున్న అల్ట్రా స్లిమ్ మోడల్‌ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. మోటోరోలా ఎడ్జ్‌ 70 పేరుతో అందుబాటులోకి రానుంది. తాజాగా భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఇటీవలే యూరప్‌ సహా ఇతర మార్కెట్స్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. గ్లోబల్ వేరియంట్‌తో పోలిస్తే ఇండియా వేరియంట్‌ అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రేపే విడుదల :
మోటోరోలా వెల్లడించిన వివరాల ఆధారంగా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 70 Smartphone) భారత్‌ మార్కెట్‌లో రేపు (డిసెంబర్ 15) విడుదల కానుంది. ఈ ఫోన్ 5.99mm థిక్‌నెస్‌తో అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు అనేక మెరుగైన ఫీచర్‌లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.

Motorola Edge 70 launching tomorrow

డిస్‌ప్లే వివరాలు :
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల (1220 x 2712 పిక్సల్స్‌) pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తోపాటు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుందని తెలుస్తోంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. OS వివరాలు సహా ఈ ఫోన్‌ ఎన్ని సంవత్సరాల OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుందో వెల్లడి కావాల్సి ఉంది.

Motorola Edge 70 launching tomorrow

50MP సెల్ఫీ కెమెరాతోపాటు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 3 ఇన్ 1 సెన్సర్ ఉంటుంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి రానుంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ మోటోరోలా స్లిమ్‌ స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4800mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 29 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 66 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ టైంను పొందుతుందని మోటో చెబుతోంది.

ఈ మోటోరోలా అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌ ఫోన్‌ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌, వైఫై, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పాంటోన్‌ బ్రాంజ్‌ గ్రీన్‌, పాంటోన్‌ లిలీ ప్యాడ్‌, గ్యాడ్జెట్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ప్రధాన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్ ఎంత ధరలో అందుబాటులోకి రానుందో వెల్లడి కావాల్సి ఉంది. మరియు ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్‌ కానుందో తెలియాల్సి ఉంది. రేపు విడుదల సమయంలో వివరాలు వెల్లడి కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Edge 70 Smartphone launching on tomorrow in india here are the confirmed specs, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X