Home
Mobile

మోటోరోలా నుంచి స్లిమ్‌ స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా కీలక వివరాలు వెల్లడి..!

మోటోరోలా సంస్థ ఈ సంవత్సరం ఎడ్జ్ 60 సిరీస్‌ తోపాటు G సిరీస్‌ ఫోన్‌ లను లాంచ్‌ చేసింది. ఇటీవల కాలంలో G సిరీస్‌ లో పవర్‌ మోడల్స్‌ ను విడుదల చేస్తోంది. అంటే ఈ ఫోన్‌లు భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. మోటో G86 పవర్‌, మోటో G06 పవర్‌, మోటో G67 పవర్‌, మోటో G57 పవర్ వంటి మోడల్స్‌ వచ్చాయి. G57 ఫోన్‌ సేల్‌ ఇటీవలే ప్రారంభం అయింది.

మోటోరోలా ఎడ్జ్‌ 70 స్మార్ట్‌ఫోన్‌ :
అయితే మోటోరోలా నుంచి స్లిమ్‌ డిజైన్‌ తో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. మోటోరోలా ఎడ్జ్‌ 70 స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 70 Smartphone) గురించి ఇటీవలే అనేక లీక్స్‌ వచ్చాయి. అయితే తాజాగా మోటో సంస్థ ఈ ఫోన్‌ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.

motorola edge 70 smartphone teased

టీజర్‌ విడుదల :
మోటోరోలా తన X హ్యాండిల్‌ ద్వారా ఎడ్జ్‌ 70 ఫోన్‌ వివరాలను షేర్‌ చేసింది. త్వరలో సన్నని ఫోన్‌ లాంచ్‌ కానుందని అర్థం వచ్చేలా టీజర్‌ వీడియో విడుదల చేసింది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ఈ ఫోన్‌ థిక్‌నెస్ వివరాలు వెల్లడయ్యాయి.

ఎంత థిక్‌నెస్‌ తో విడుదల కానుందంటే? :
ఫ్లిప్‌కార్ట్ వివరాల ఆధారంగా మోటోరోలా స్లిమ్‌ ఫోన్‌ 5.99mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ ఓలివ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్‌ లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుందనే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.

స్లిమ్‌ ఫోన్‌ అంచనా వివరాలు! :
మోటోరోలా ఎడ్జ్‌ 70 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌ తో పనిచేసే అవకాశం ఉంది. 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనా వివరాల ఆధారంగా ఈ ఫోన్ రూ.35 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గ్లోబల్ వేరియంట్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు :
మోటో ఎడ్జ్‌ 70 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వేరియంట్‌ ఇప్పటికే విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల 1.5K 10 బిట్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ ‌బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ OIS ( ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 120 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో 50MP అల్ట్రా వైడ్‌ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 4k వీడియో ను సపోర్టు చేస్తాయి. ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
motorola edge 70 smartphone teased, confirmed to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X