సన్నని స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా.. ఇవాళ్టి నుంచే సేల్.. మూడు 50MP కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జింగ్ సహా..
Motorola Edge 70 Smartphone Sale : మోటోరోలా ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఎడ్జ్ 60 సిరీస్‌తోపాటు V50, V60 సిరీస్ మోడల్స్ సహా Y సిరీస్‌లోనూ ఫోన్‌లను తీసుకొచ్చింది. అయితే ఇటీవల మోటోరోలా అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 16 OS, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ సేల్ :
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్‌లతోనూ లభిస్తుంది.

ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. పాంటోన్ గ్యాడ్జెట్ గ్రే, పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ లిలీ ప్యాడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, అల్యూమినియం ఫ్రేమ్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ 5.99mm థిక్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కూడా ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటోరోలా హామీ ఇచ్చింది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సర్ ఉన్నాయి. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ కెమెరా విభాగం AI Photo Enhancement, AI Video Enhancement, ఏఐ యాక్షన్ షాట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 68W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








