అల్యూమినియం ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, స్లిమ్ డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు..!
Motorola Edge 70 Smartphone : మోటోరోలో తన అల్ట్రా స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 70 పేరుతో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తోపాటు 5.99mm థిక్‌నెస్‌తో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మోటో ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ 6.7 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ ను సపోర్టు చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ప్రత్యేక ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో విడుదల అయింది. ఈ ఫోన్ 5.99mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ మోటోరోలా ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సర్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్ కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఏఐ యాక్షన్ షాట్, AI Video Enhancement, AI Photo Enhancement వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఈ ఫోన్ Next Move, Pay Attention 2.0, Catch Me Up 2.0 వంటి ఫీచర్‌లు ఉన్నాయి.
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 5000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 68W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఫోన్‌ను మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ గ్యాడ్జెట్ గ్రే, పాంటోన్ లిలీ ప్యాడ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








