మోటరోలా కొత్త ఉత్పత్తులు!

Posted By:

సెప్టంబర్ అత్యత్తమ టెక్నాలజీ ఆవిష్కరణలకు వేదిక కానుంది. సామ్‌సంగ్, యాపిల్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు సెప్టంబర్‌లో తమ సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించబోతున్నాయి. మరోవైపు మోటరోలా కూడా తన సరికొత్త ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో ప్రదర్శించేందుకు తహతహలాడుతోంది. సెప్టంబర్ 4న చికాగోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో మోటరోలా ఓ స్మార్ట్‌వాచ్‌తో పాటు పలు ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మోటరోలా ఆవిష్కరించబోయే కొత్త ఉత్పత్తులకు సంబంధించి వెబ్ ప్రపంచంలో అనేక రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా కొత్త ఉత్పత్తులు!

మోటో 360:

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మోటరోలా తన మోటో 360 స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి రిటైల్ మార్కెట్ అందుబాటు వివరాలను వెల్లడించే అవకాశముంది. మోటరోలా ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన మోటో 360 ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ ఎల్‌జీ, సామ్‌సంగ్, సోనీ స్మార్ట్‌వాచ్‌లకు పోటీగా నిలవనుంది. మోటో 360 స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ 4.3, ఆండ్రాయిడ్ 4.4, ఆండ్రాయిడ్ ఎల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలను సపోర్ట్ చేయనుంది.

 

మోటరోలా కొత్త ఉత్పత్తులు!

మోటో ఎక్స్+1

ఇదే ఆవిష్కరణ కార్యక్రమంలో మోటరోలా మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్ అయిన మోటో ఎక్స్+1ను ప్రదర్శించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోటో ఎక్స్+1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల అంచనా..5.2 అంగుళాల ఎఫ్‌హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాససర్, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

మోటరోలా కొత్త ఉత్పత్తులు!

మోటో జీ2

ఇదే ఆవిష్కరణ కార్యక్రమంలో మోటరోలా మోటో జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతున్న మోటో జీ2 స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా ప్రదర్శించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోటో జీ2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే అనేక రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు మోటో జీ2,  సెప్టంబర్ 10నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నెలలో యాపిల్ తన ఐఫోన్ 6ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. మోటో జీ2 స్పెసిఫికేషన్‌లు..? (అంచనా మాత్రమే). 720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

 

మోటరోలా కొత్త ఉత్పత్తులు!

గూగుల్ నెక్సూస్ 6

మోటరోలా షామూ పేరుతో గూగుల్ నెక్సూస్ 6 స్మార్ట్‌‍ఫోన్‌ను మోటరోలా రూపకల్పన చేస్తోందని ఇటీవల వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపించాయి. ఈ
ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను మోటరోలా ఈ వేదిక పై వెల్లడించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

 

మోటరోలా కొత్త ఉత్పత్తులు!

మోటరోలా ఎక్స్‌ప్లే

ఇదే ఆవిష్కరణ కార్యక్రమంలో మోటరోలా ఎక్స్‌ప్లే పేరుతో ఓ పెద్దతెర ఫాబ్లెట్‌ను ప్రదర్శించే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Event Confirmed for September 4: All That You Can Expect. Read more in 
 Telugu Gizbot..........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot