మ్యాక్స్ స్కోప్ 150కో పోల్చితే మోటరోలా ఈఎక్స్ 109నే బెస్ట్...

Posted By: Staff

మ్యాక్స్ స్కోప్ 150కో పోల్చితే మోటరోలా ఈఎక్స్ 109నే బెస్ట్...

ఇండియన్ మొబైల్ మార్కెట్లో రోజురోజుకీ విడుదలవుతున్న స్మార్ట్ పోన్స్‌లలో ఏ స్మార్ట్ ఫోన్ బెస్ట్ స్మార్ట్ పోన్ అని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. అంతేకాకుండా ఏ కస్టమర్‌కి ఏ స్మార్ట్ ఫోన్ ఎందుకు నచ్చుతుందో కూడా చెప్పాలంటే కష్టం. ఇటువంటి తరుణంలో ఇంటర్నేషనల్ మొబైల్ గెయింట్ మోటరోలా, దేశీయ మొబైల్ దిగ్గజం మ్యాక్స్ మొబైల్స్ రెండు కూడా డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేశాయి. రెండు మొబైల్స్ డ్యూయల్ సిమ్, టచ్ ఫెసిలిటీని కలిగి ఉండడం వల్ల మార్కెట్లో హై డిమాండ్ మొబైల్స్‌గా పేర్కోంటున్నారు.

ఈ రెండు మొబైల్స్ గురించిన సమాచారం కాస్త తెలుసుకుందాం. మోటరోలా కంపెనీ విడుదల చేసిన మోటరోలా ఈఎక్స్ 109 క్వర్టీ సాప్ట్ టచ్ కీప్యాడ్స్‌తో పాటు 2 ఇంచ్ వైడ్ స్క్రీన్ తో పాటు టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్ ప్లేతో పాటు సూపర్బ్ క్లారిటీని యాజర్స్‌కు అందిస్తుంది. ఇక మ్యాక్స్ కంపెనీ విడుదల చేసిన మ్యాక్స్ స్కోప్ 150 మాత్రం 2.8 ఇంచ్ వైడ్ స్క్రీన్ తో పాటు టిఎఫ్‌టి టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. మోటరోలా ఈఎక్స్ 109 ఫోన్‌లో కెమెరా 2 మెగా ఫిక్సల్ ఉండడం వల్ల చక్కని ఇమేజీలను తీయవచ్చు. అదే మ్యాక్స్ స్కోప్ 150లో కెమెరా 1.3 మెగా ఫిక్సల్‌ని మాత్రమే కలిగి ఉంది.

మ్యాక్స్ స్కోప్ 150తో గనుక మోటరోలా ఈఎక్స్ 109ని పోల్చితే చూడడానికి మ్యాక్స్ స్కోప్ 150నే చాలా అందంగా ఉంటుంది. మొమొరీ స్టోరేజి విషయంలో కూడా యూజర్స్‌ని రెండు మొబైల్స్ నిరాశపర్చవు. మోటరోలా ఈఎక్స్ 109 మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా మొమొరీ లభించగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఐతే మ్యాక్స్ స్కోప్ 150 మాత్రం మొమొరీని 8జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఆఫ్షన్స్ అయిన బ్లూటూత్, యుఎస్‌బిలు సపోర్ట్ చేస్తాయి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లలో మ్యూజిక్ ప్లేయర్స్, వీడియో ప్లేయర్స్ ఉండడంతో పాటు ఎఫ్ ఎమ్ రేడియో కూడా ప్రత్యేకం.

రెండు మొబైల్స్‌కి సంబంధించిన ధరలు కూడా సుమారుగా ఒకే విధంగా ఉండడం గమనార్హాం. మ్యాక్స్ స్కోప్ 150 మొబైల్ ధర సుమారుగా రూ 3249 ఉండగా, అదే మోటరోలా ఈఎక్స్ 109 ధర కూడా రూ 3,275గా నిర్ణయించడమైంది. రెండు మొబైల్స్‌లలో ఏది బెస్ట్ అని అంటే మాత్రం మోటరోలా ఈఎక్స్ 109 మాత్రమేనని చెబుతారు. ఎందుకంటే మోటరోలా ఈఎక్స్ 109 ఎక్కవ మొమొరీ స్టోరేజిని కలిగ ఉండడమే అందుకు కారణం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot