పాఠకులకు ఈ రోజు 'మోటరోలా ఈఎక్స్119' మొబైల్ ప్రత్యేకం

Posted By: Staff

పాఠకులకు ఈ రోజు 'మోటరోలా ఈఎక్స్119' మొబైల్ ప్రత్యేకం

మోటరోలా కొత్తగా మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ జిఎస్ఎమ్ క్వర్టీ మొబైల్ 'మోటరోలా ఈఎక్స్119 బ్రియా'ని ఇండియాలో ప్రవేశపెట్టింది. మోటరోలా ఈఎక్స్119 బ్రియా మొబైల్ 2.4 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు, 240 x 320 ఫిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం ఇండియాలో డ్యూయల్ సిమ్ హావా కొనసాగుతుండడంతో మోటరోలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ డ్యూయల్ సిమ్ జిఎస్ఎమ్ మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది.

మోటరోలా ఈఎక్స్119 బ్రియా మొబైల్ క్వర్టీ కీప్యాడ్, 3 మెగా ఫిక్సల్ కెమెరా, ఎఫ్ ఎమ్ రేడియో, అన్ని రకాల ఆడియో వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే గుణాన్ని కలిగి ఉంది. వీటితో పాటు మొబైల్‌ని బయట స్పీకర్స్‌‍కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. మొబైల్ తో పాటు ఇంటర్నల్‌గా 128 MB, 64 MB RAM లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులు బాటు కల్పించడం జరిగింది.

మోటరోలా ఈఎక్స్ 119 బ్రియా మొబైల్ కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బిలను సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 10mAh Lithium Ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ సమయం 4 గంటలు. మోటరోలా ఈఎక్స్119 బ్రియా మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

మోటరోలా ఈఎక్స్119 బ్రియా మొబైల్ ప్రత్యేకతలు:

* 2.4-inch Touchscreen Display
* 240 x 320 Pixel screen resolution
* 3 Megapixel Camera
* Stereo FM Radio
* 128 MB Internal memory
* 64 MB RAM
* Expandable Memory Up to 16 GB
* Multi Format Video/Audio Player
* Bluetooth, Wi-Fi, WAP/GPRS
* USB 2.0
* 3.5mm Audio Jack
* 910mAh Lithium Ion Battery
* Talk Time: Up to 4 hours
* Standby Time: Up to 200 hours
* Dimension: 103 x 60 x 9.9 mm
* Weight: 92 gm

ఇండియన్ మొబైల్ మార్కెట్లో మోటరోలా ఈఎక్స్119 బ్రియా మొబైల్ ధర సుమారుగా రూ 5,500/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot